Post Office Jobs 2025: Postal Department లో పర్మినెంట్ ఉద్యోగాలు
Post Office Jobs 2025 ఉద్యోగాల కోసం ఎదురుచూసే నిరుద్యోగులకు భారీ శుభవార్త. పోస్టల్ డిపార్ట్మెంట్ నుండి స్టాఫ్ కార్ డ్రైవర్ ఉద్యోగాలు కోసం భారీ నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ నోటిఫికేషన్ లో Staff Car Driver (Ordinary Grade) ఉద్యోగాల కోసం దరఖాస్తులను కోరుతుంది. ఈ ఉద్యోగాల కోసం 10వ తరగతి పూర్తిచేసిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాల కోసం అప్లై చేసుకునే అభ్యర్థులు డిసెంబర్ 19 తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఈ ఉద్యోగాలకు కేవలం Offline లో మాత్రమే Apply చేసుకోవాలి. చాలా తక్కువ టైం ఉంది కాబట్టి అర్హత కలిగి ఉన్న అభ్యర్థులు వెంటనే Apply చేసుకోండి. ఈ ఉద్యోగాలకు సంబంధించి పూర్తి వివరాలు క్రింద ఉన్నాయి జాగ్రత్తగా చదివి Apply చేసుకోండి.
ఆర్గనైజేషన్:
ఈ నోటిఫికేషన్ మనకు Postal Department నుండి Staff Car Driver (Ordinary Grade) ఉద్యోగాల కోసం విడుదల అయింది.
జాబ్ రోల్స్ & ఖాళీలు:
ఈ నోటిఫికేషన్ ద్వారా Staff Car Driver (Ordinary Grade) ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఇందులో అఫీషియల్ గా 02 ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. ఆ ఉద్యోగాలు ఏంటో క్రింది ఉన్నాయ్ చూడండి.
- UR: 01
- EWS: 0
- OBC: 01
- SC: 0
- ST: 0
విద్య అర్హత:
ఇందులో ఉన్న Staff Car Driver (Ordinary Grade) ఉద్యోగాలకు అప్లై చేయాలనుకున్నవారు 10వ తరగతి పూర్తి చేసి ఉండవలెను. అలాగే light & heavy driving licence ఉండాలి.
Staff Car Driver (Ordinary Grade): 10th & Driving Licence (Light & Heavy)
వయస్సు:
ఈ ఉద్యోగాలకు Apply చేసే అభ్యర్థులకు కనిష్టంగా 18 సంవత్సరాలు వయసు ఉండాలి. గరిష్టంగా 27 సంవత్సరాలు ఉండాలి. OBC మరియు EWS వాళ్లకి 03 సంవత్సరాలు వయసు సడలింపు. SC/ST వాళ్లకు 05 సంవత్సరాలు వయసు సడలింపు. గవర్నమెంట్ సర్వెంట్స్ అయితే 40 సంవత్సరాలు వరకు కూడా అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం:
ఈ ఉద్యోగాలకు Apply చేసుకున్న అభ్యర్థులకు మొదటగా షాట్ లిస్టింగ్ ప్రాసెస్ ఉంటుంది. షార్ట్ లిస్ట్ అయినా అభ్యర్థులకు Written Test ఆ తర్వాత Skill Test ఉంటుంది. ఆ తర్వాత Merit List ఉంటుంది. మెరిట్ లిస్టులో ఎంపికైన వారికి జాబ్ ఇవ్వడం జరుగుతుంది. పూర్తి వివరాలు కోసం క్రింది నోటిఫికేషన్ చూడండి.
Apply విధానం:
ఈ జాబ్స్ కి కేవలం offline లో మాత్రమే Apply చేయాలి. కాబట్టి దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థులు తప్పనిసరిగా అధికారిక నోటిఫికేషన్ జాగ్రత్తగా చదివి అర్హత ఉన్నట్లయితే అప్లికేషన్ చేసుకోవడం కోసం నోటిఫికేషన్ లో చిరునామా కి పోస్ట్ ద్వారా దరఖాస్తు ఫారం ను, సంబంధిత పత్రాలను పంపించాలి. పూర్తి వివరాలు కోసం క్రింది వీడియో చూసి క్రింది ఇచ్చిన లింక్స్ ని క్లిక్ చేసి Apply చేసుకోండి.
ఫీజు:
ఈ Post Office Jobs 2025 నోటిఫికేషన్ లో ఉన్న ఉద్యోగాలకు Apply చేయాలనుకున్న వాళ్లకు 500/- రూపాయలు అప్లికేషన్ ఫీజు ఉంటుంది.
జీతం:
ఈ Post Office Jobs 2025 ఉద్యోగాలకు ఎంపిక అయినట్లయితే అభ్యర్థికి ప్రతి నెల ₹19900-₹63200 వరకు జీతం ఉంటుంది.
ముఖ్యమైన తేదీలు & లింక్స్:
Apply చేయడానికి చివరి తేదీ: 19/12/2024
Latest జాబ్స్ కోసం: ఇక్కడ క్లిక్ చేయండి
అధికారిక నోటిఫికేషన్ : క్రింద డౌన్లోడ్ చేయండి
WhatsApp గ్రూప్ లో జాయిన్ అవ్వండి: ఇక్కడ క్లిక్ చేయండి