APPSC GROUP 4 Previous Year Papers Download PDF Free
APPSC GROUP 4 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకు మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలను ఇక్కడ అందించడం జరిగింది. ఈ మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు రాబోయేటువంటి గ్రూప్ 4 ఎక్సమ్ కి ఎంతగానో ఉపయోగపడతాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ మునుపటి సంవత్సర ప్రశ్నపత్రాలను డౌన్లోడ్ చేసుకొని ప్రిపేర్ అవ్వండి.
APPSC GROUP 4 Previous Year Question Papers
ఏపీపీఎస్సీ గ్రూప్ 4 మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు అనేవి అభ్యర్థులకు ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించడానికి ఎంతగానో సహాయ పడతాయి. కాబట్టి APPSC GROUP 4 ఎగ్జామ్ కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు తప్పనిసరిగా ఈ మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు అనేవి తప్పకుండా క్షుణ్ణంగా పరిశీలించుకుని చూసుకోవాలి. ఎందుకంటే మనకి ఎగ్జామ్లో ఏ విధమైనటువంటి ప్రశ్నలు అడుగుతున్నాడు అదేవిధంగా ఎగ్జామ్ యొక్క మోడల్ అనేది ఈ ప్రీవియస్ పేపర్స్ వలన చాలా బాగా తెలుస్తుంది. అందువలన మనం ఈ మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలను తప్పనిసరిగా ఒక్కసారైనా చూసుకోవాలి.
APPSC GROUP 4 Previous Year Papers Download వలన ఉపయోగాలు ఏంటి?
APPSC GROUP 4 Previous Papers వలన గ్రూప్ 4 కి ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి. అందులో కొన్నిటిని ఇప్పుడు చూద్దాం.
• పరీక్ష సరళని అర్థం చేసుకోవడం
ఏపీపీఎస్సీ గ్రూప్ 4 కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులకి పరీక్షా సరళని అర్థం చేసుకోవడంలో మునుపటి ప్రశ్న పత్రాలు ఎంతగానో సహాయపడతాయి. మునుపటి సంవత్సరాల్లో జరిగిన గ్రూపు 4 యొక్క పరీక్షల్లో ప్రశ్నాపత్రాలు ఏ విధంగా వచ్చాయి అదేవిధంగా ప్రశ్నలు ఏ విధంగా అడిగాడు మరియు పరీక్ష యొక్క మోడల్ అనేది మనకి క్షుణ్ణంగా తెలుస్తోంది.
• పరీక్షకు ఎలా ప్రిపేర్ కావాలి
APPSC GROUP 4 Previous Year Papers వలన రాబోయేటువంటి పరీక్షకి ఎలా ప్రిపేర్ కావాలి అనేది బాగా అర్థమవుతుంది. ఎలా అంటే మునుపటి సంవత్సరాల్లో అడిగిన ప్రశ్నలు ఏ విధంగా అడిగాడు ఏ మోడల్స్ లో అడుగుతున్నాడు అనేది బాగా అర్థమవుతుంది. కాబట్టి రాబోయేటువంటి పరీక్షల్లో ప్రశ్నలు ఏ విధంగా రావొచ్చు అనేది ఒక అంచనా వేసుకుని ప్రిపేర్ అవ్వచ్చు.
• Time Management
APPSC GROUP 4 Previous Year Papers ను సాధన చేయడం వలన టైం మేనేజ్మెంట్ అనేది మెరుగు పడుతుంది. ఎలా అంటే మీరు ఎక్కువగా ప్రీవియస్ పేపర్స్ ను సాధన చేయడం వలన ఎంతవరకు టైం ని స్పెండ్ చేస్తున్నారు అనేది తెలుస్తుంది. ఇలా తెలియడం వలన సమయాన్ని మెరుగు పరుచుకుని ఫైనల్ ఎగ్జామ్ లో సమయాన్ని ఆదా చేసుకుంటూ ఎక్కువ మార్కులను సాధించవచ్చు.
• సాధారణ తప్పులు
అభ్యర్థులు ఎగ్జామ్ రాస్తున్నప్పుడు చేస్తున్న సాధారణ తప్పులు తెలుసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఎలా అంటే మీరు APPSC Group 4 కి సంబంధించి ఒక మాక్ టెస్ట్ ను రాసినప్పుడు మీరు మీ యొక్క తప్పులను గమనించుకోవాలి. ఇలా మీ యొక్క సాధారణ తప్పులను తెలుసుకొని వాటిని ఇంప్రూవ్ చేసుకోవాలి.
APPSC GROUP 4 Previous Year Papers Download PDF Free
APPSC GROUP 2 Prelims and Mains Examination Class
APPSC GROUP 3 Previous Year Papers Download PDF Free
TSPSC GROUP -2 Free Mock Tests
APPSC GROUP’S Free Mock Tests
APPSC GROUP 4 Previous Year Papers ను ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి Step by Step:-
Step -1
APPSC Group 4 previous year papers ను డౌన్లోడ్ చేసుకోవడానికి ముందుగా APPSC యొక్క అధికారిక Website లోకి వెళ్ళండి.
Step -2
వెబ్సైట్ లో మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు అనే విభాగంలోకి వెళ్ళవలసిన అవసరం ఉంటుంది. ఇక్కడ మీరు ప్రశ్న పత్రాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Step -3
మునుపటి సంవత్సర ప్రశ్న పత్రాలు అనే విభాగంలో Group 4 కి సంబంధించి ప్రశ్న పత్రాలు అనే దాని మీద క్లిక్ చేయాలి. తర్వాత మీరు క్వశ్చన్ పేపర్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Step -4
విజయవంతంగా APPSC Group 4 previous year papers ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీరు మీ యొక్క డ్రైవ్ లో సేవ్ చేసుకోవాలి.
Step -5
ప్రశ్న పత్రాలను డ్రైవ్ లో సేవ్ చేసుకున్న తర్వాత వీటిని మీయొక్క ప్రిపరేషన్ లో భాగం చేసుకొని వాటిని సాధన చేస్తూ మీ యొక్క బలహీనతలను అభివృద్ధి చేసుకుంటూ ముందుకి పోవాలి.
APPSC GROUP 4 Exam లో ఎక్కువ మార్కులను సాధించడం ఎలా?
ఏపీపీఎస్సీ గ్రూప్ 4 ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించాలి అంటే క్రింది చెప్పిన విధంగా ప్రిపరేషన్ కొనసాగించాలి. కాబట్టి గ్రూప్ త్రీ కి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ఈ టిప్స్ ని పాటించండి రాబోతున్న ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించండి.
• సిలబస్ ను అర్థం చేసుకోండి
ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నప్పుడు సిలబస్ ను అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సిలబస్ ను ఎంత బాగా అర్థం చేసుకుంటే ఎగ్జామ్ లో అంత ఎక్కువ మార్కులు సాధించవచ్చు. కాబట్టి అభ్యర్థులందరూ కూడా ఎగ్జామ్ కి సంబంధించి ముందు సిలబస్ ను పూర్తిగా అర్థం చేసుకోండి.
• ఎక్కువ weightage ఉన్న టాపిక్స్
అభ్యర్థులు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్న సమయంలో ముందుగా ఎక్కువ మార్కులు వస్తున్నటువంటి టాపిక్స్ పైన ఎక్కువ దృష్టిసారించాలి. ఎందుకంటే ముందుగా అధికంగా మార్పులు వస్తున్న టాపిక్స్ పైన దృష్టి పెట్టినప్పుడు ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంది. ముందు ఎక్కువ మార్కులు వస్తున్న టాపిక్స్ పైన దృష్టి పెట్టి తర్వాత మిగతా టాపిక్స్ పైన దృష్టి పెట్టాలి.
• మాక్ టెస్ట్ లు & గ్రాండ్ టెస్ట్ లు
APPSC Group 4 Exam లో విజయం సాధించడం కోసం మాక్ టెస్ట్ లు మరియు గ్రాండ్ టెస్ట్ లు చాలా చాలా ఉపయోగపడతాయి. ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తప్పనిసరిగా ఇవి రాయవలసి ఉంటుంది. ఎందుకంటే ఇవి రాసినప్పుడు మన యొక్క శక్తి సామర్థ్యాలు తెలుస్తాయి. ఎంతవరకు ప్రిపేర్ అయ్యాం మరియు ఎగ్జామ్ లో మనకి ఎంత స్కోర్ వస్తుంది అదేవిధంగా ఎగ్జామ్ రాసేటప్పుడు ఎలాంటి తప్పులు చేస్తున్నావ్ అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఇలా ప్రతిదీ తెలుసుకొని వాటిని డెవలప్ చేసుకుని ముందుకు సాగాలి.
• ప్రీవియస్ పేపర్స్
APPSC Group 4 ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు సాధించడానికి ముఖ్య కారణం ప్రీవియస్ పేపర్స్. ఎందుకంటే ఈ ప్రీవియస్ పేపర్స్ అనేవి ఎగ్జామ్ యొక్క మోడల్ అర్థం చేసుకోవడంలో ఎంతగానో సహాయపడతాయి. కాబట్టి అభ్యర్థులందరూ కూడా తప్పనిసరిగా ప్రీవియస్ పేపర్స్ ని కూడా మీ యొక్క ప్రిపరేషన్ లో భాగం చేసుకోండి.
• రివిజన్
APPSC Group 4 exam లో విజయం సాధించాలి అంటే తప్పకుండా రివిజన్ చేయాలి. చాలామంది అభ్యర్థులు చేసే తప్పు ఏమిటంటే పరీక్షకి ముందు రోజు కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు, కానీ అలా చేయడం చాలా తప్పు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎగ్జామ్ కి ముందు తప్పుకున్న మీయొక్క ప్రిపరేషన్ రివిజన్ చేయండి. ఇలా చేయడం ద్వారా ఫైనల్ ఎగ్జామ్ లో తప్పకుండా విజయం సాధిస్తారు. వీటితోపాటు ప్రతిరోజు మీరు చదివిన దానిమీద టాపిక్ వైస్ టెస్టులు రాయండి అలాగే మాక్ టెస్ట్ లు గ్రాండ్ టెస్ట్ లు కూడా రాయండి. ఇలా చేస్తే తప్పకుండా విజయం మీదే.
Conclusion
ఈ ఆర్టికల్ లో ఏపీపీఎస్సీ గ్రూప్ 4 కి సంబంధించి మునుపటి ప్రశ్న పత్రాలు ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చెప్పడం జరిగింది, అదేవిధంగా గ్రూప్ 4 ఎగ్జామ్ లో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలి మరియు విజయం ఎలా సాధించాలి అనేదే చెప్పడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క అభ్యర్థి కూడా తప్పకుండా పైన చెప్పిన విధంగా ప్రిపరేషన్ చేస్తూ ముందుకు సాగడం వలన తప్పకుండా విజయం సాధిస్తారు.