అన్నదాతా సుఖీభవ పథకానికి తాము అర్హులామా? ఇక్కడ తెలుసుకోండి!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేస్తున్న అన్నదాతా సుఖీభవ పథకం రైతులకు ఆర్థిక మద్దతును అందించడమే లక్ష్యంగా కలిగి ఉంది. ఈ పథకానికి తాము అర్హులామా కాదా అనే సందేహం ఉన్న రైతుల కోసం ప్రభుత్వం ఒక సులభమైన ఆన్‌లైన్ టూల్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది.
రైతులు తమ ఆధార్ నంబర్ ద్వారా ఈ వివరాలను చాలా తేలికగా తెలుసుకోగలుగుతారు. ఇందుకోసం మీరు https://annadathasukhibhava.ap.gov.in అనే అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అక్కడ Check Status అనే ఆప్షన్‌పై క్లిక్ చేసి, మీ ఆధార్ నంబర్‌ను మరియు కింద కనిపించే క్యాప్చా కోడ్‌ను ఎంటర్ చేయాలి. అప్పుడు మీరు ఈ పథకానికి అర్హులా? కాదా? అన్నది స్పష్టంగా తెలుసుకోవచ్చు.
మీరు అర్హులా కాదా తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
Check Status 👈అంతేకాదు, మీరు పథకానికి అనర్హులైతే, ఎందుకు అనర్హత వచ్చిందన్న కారణం కూడా అక్కడే చూపిస్తుంది. ఇలా వ్యవస్థను పారదర్శకంగా ఉంచడం ద్వారా ప్రభుత్వ నిధులు నిజమైన అర్హులైన రైతులకే చేరేలా చర్యలు తీసుకుంటోంది.