AP DSC 2024 పరీక్ష వాయిదా పడనున్నదా? AP TET ఫలితాలు ఎప్పుడు?

Telegram Group Join Now
WhatsApp Group Join Now
Youtube Channel Subscribe

AP DSC 2024 పరీక్ష వాయిదా పడనున్నదా? AP TET ఫలితాలు ఎప్పుడు?

ఆంధ్ర ప్రదేశ్ లో AP DSC నోటిఫికేషన్ 2024 విడుదల అయ్యింది. 6,100 టీచర్ పోస్టులకు మార్చి 30 నుంచి ఏప్రిల్ 30, 2024 వరకు పరీక్ష జరగనున్నది అని DSC ప్రకటించినది. ఇప్పటికే TET పరీక్షను నిర్వహించినది, ఫలితాలు వెలువడాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉన్న కారణంగా పరీక్షను నిర్వహిస్తారా లేదా అనే స్పష్టత లేదు . ఈ ఆర్టికల్ నందు ప్రభుత్వం తరపున వాజ్యం మరియు హైకోర్ట్ అలాగే ఎన్నికల కమీషన్ పరీక్ష నిర్వహణపై ఏమంటున్నాయో చూద్దాం!

AP DSC 2024 అవలోకనం

సంస్థ                         కమీషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, ఆంధ్రప్రదేశ్ (AP DSC)

పోస్ట్స్                         SGT,TGT, PGT,SA టీచర్

ఖాళీలు                      6100

How to Crack RRB NTPC 2024 Exam First Attempt in Telugu
How to Crack RRB NTPC 2024 Exam First Attempt in Telugu

నోటిఫికేషన్ తేదీ      07 ఫిబ్రవరి 2024

పరీక్ష తేదీలు              మార్చి 30 నుంచి ఏప్రిల్ 30 వరకు    

అధికారిక వెబ్సైట్    cse.ap.gov.in / apdsc.apcfss.in

AP DSC పరీక్ష నిలిపివేయబడదు: AP హైకోర్ట్

AP DSC 2024 నోటిఫికేషన్ ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది AP DSC 2024 విషయం లో ఎలాంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని తేల్చి చెప్పింది. AP DSC పరీక్ష పూర్తిగా ప్రభుత్వ విధాన నిర్ణయమని తేల్చింది. ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాల్లో తాము ఇప్పటికప్పుడు జోక్యం చేసుకోలేమంది.  ఫిబ్రవరిలో జారీ చేసిన జీవోలను ఇప్పుడు నవాలు వేశారని గుర్తు చేసింది. మధ్యంతర ఉత్తర్వులు కావాలంటే ముందే కోర్టుకొచ్చి ఉండాల్సిందని తెలిపింది. ఉపాధ్యాయ పోస్టుల భర్తీ, వారి అర్హతలు తదితర విషయాలపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను మే 1కి వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ రీరజ్ సింగ్ ఠాకూర్, న్యాయమూర్తి జస్టిస్ రావు రఘునందన్ రావు ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

MPPSC State Forest Services Exam 2024 Apply Online, Syllabus and Preparation Strategy - (Step by Step Guide)
MPPSC State Forest Services Exam 2024 – మెయిన్స్ పరీక్ష కోసం ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయండి

AP DSC Exam Postpone News

ప్రభుత్వ పాఠశాలల్లో ఆర్హ తలు కలిగిన వారిని ఉపాధ్యాయులుగా నియమించాలని, ఈ విషయంలో అన్ని స్కూళ్లను ఒకే రకంగా చూసేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ డాక్టర్ గుంటుపల్లి శ్రీనివాస్ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. పాఠశా లల్లో వివిధ ఉపాధ్యాయ పోస్టుల మార్గదర్శకాల జీవోలు 11, 12కు సంబంధించి తదుపరి చర్యలన్నీ నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ఈ వ్యాజ్యంపై సీజే ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది ఇంద్రనీల్ బాబు వాదనలు వినిపిస్తూ.. స్థానిక సంస్థల పాఠశా లల్లో ఇంగ్లిష్ నైపుణ్యం ఉన్న వారిని టీచర్లుగా నియమిచడం లేదని, వారికి ఇంగ్లిష్ నైపుణ్య పరీక్ష నిర్వ హించడం లేదని తెలిపారు. రెసిడెన్షియల్, మోడల్, గురుకుల పాఠశాలల్లో మాత్రమే ఇంగ్లీషు నైపుణ్య పరీక్ష నిర్వహిస్తున్నారని తెలిపారు. అర్హులైన టీచర్లను నియమించేలా ఆదేశాలు జారీ చేయాలని కోరారు.

AP DSC పరీక్షకు ఎన్నికల సంఘం అనుమతి కావాలి!:EC

ఎన్నికల సంఘం అనుమతి లభించిన తర్వాతే డీఎస్సీ పరీక్షలు నిర్వహిస్తామని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి (సీఈవో) ముఖేష్ కుమార్ మీనా చెప్పారు. బుధవారం సచివాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ డీఎస్సీలో 6,100 పోస్టులకు 4.72 లక్షల మంది పోటీపడు తున్నట్లు తెలిపారు. డీఎస్సీ నిర్వహించాలని కొందరు, వాయిదా కోరుతూ మరికొందరు మెయిల్స్, ఫోన్ ద్వారా విజ్ఞప్తి చేయడంతో ఈ విషయాన్ని కేంద్ర ఎన్ని కల సంఘం (ఈసీ) దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.

AP DSC 2024 పరీక్ష నిర్వహించడానికి అనుమతి కోరుతూ ఈసీకి రాష్ట్ర ప్రభుత్వం త్వరలో లేఖ రాయనుందని, ఇందుకోసం సీఎస్ ఆధ్వర్యంలో ఒక స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం డీఎస్సీ నిర్వహించమంటే నిర్వహిస్తామని, లేదంటే వాయిదా వేస్తామని స్పష్టం చేశారు.

"Complete details about Mazagon Dock Non-Executive Job Notification 2024 – vacancies, eligibility, application procedure, selection process, salaries, and exam syllabus. Comprehensive information for candidates preparing for MDL Non-Executive jobs."
Mazagon Dock Non-Executive Job Notification 2024: Job Notification, Selection Procedure, Salary Details and Preparation Tips
AP TET ఫలితాలు ఎప్పుడు?

ప్రస్తుతం ఎన్నికల కోడ్ అమలులో ఉండడం, హైకోర్ట్ లో AP DSC కి సంబంధించి పలు వాజ్యాలు విచారణలో ఉండడంతో పాటు, ప్రస్తుతం రాష్ట్రములో 144 సెక్షన్ అమలులో ఉన్న నేపధ్యంలో ఫలితాల ప్రకటన అనేది పూర్తిగా ఎన్నికల కమీషన్ యొక్క పరిధిలో ఉన్నది. ఈ విషయమై ప్రస్తుతం ఎన్నికల కమీషన్ తన తుది నిర్ణయం తెలిపేవరకు AP TET ఫలితాలు ప్రకటించవద్దని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి తేల్చిచెప్పారు. కావున అభ్యర్ధులు ఫలితాల కోసం మరింత సమయం వేచి ఉండాల్సి ఉంది.

Populer searches for this topics :-

APPSC  GROUPS MOCK TESTS

Click Here 

TSPSC GROUP -3 Free Mock Tests 

Click Here 

TSPSC & DSC Free Grand Test Class Join Now

👉 Join Class Now 

SBI Specialist Cadre Officer Recruitment 2024: Job Description, Qualifications, Application Process, and Selection Procedure
SBI Specialist Cadre Officer Recruitment 2024: ఉద్యోగ వివరణ, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, మరియు ఎంపిక విధానం

డీఎస్సీకి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థులు తప్పనిసరిగా పైన ఇచ్చినటువంటి యూట్యూబ్ మరియు టెలిగ్రామ్ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి.

ఎందుకంటే యూట్యూబ్లో ప్రతిరోజు డీఎస్సీ కి సంబంధించి ఈ క్లాసెస్ అయితే నిర్వహించడం జరుగుతుంది. సబ్జెక్టు వైస్ గ్రాండ్ టెస్ట్ లు మరియు మెగా గ్రాండ్ టెస్ట్ లు కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది.

కాబట్టి ప్రతి ఒక్కరు కూడా అన్న ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి .

Leave a Comment